Ott Movie: నాన్ స్టాప్ గా నవ్వించే కంటెంట్.. ఓటీటీలో ఐశ్వర్య రాజేష్ మూవీ చూసితీరాల్సిందే!
Wed Jun 18, 2025 15:44 Cinemas
తెలుగు.. తమిళ భాషలలో ఐశ్వర్య రాజేశ్ కి ఎంతో క్రేజ్ ఉంది. తమిళంలో ఆమె చేసిన సినిమాలలో కొన్ని ఓటీటీలో ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాయి. అలాంటి సినిమాల జాబితాలో 'సొప్పన సుందరి' ఒకటిగా కనిపిస్తుంది. ఎస్. జి. చార్లెస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 2023లో థియేటర్లకు వచ్చింది. ఆ తరువాత హాట్ స్టార్ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. విశాల్ చంద్రశేఖర్ నేపథ్య సంగీతాన్ని అందించిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఆడియన్స్ మనసులను కొల్లగొడుతూనే ఉంది. బ్లాక్ కామెడీ జోనర్లో వచ్చిన ఈ సినిమా, మొదటి నుంచి చివరివరకూ నవ్విస్తూనే ఉంటుంది. కథ విషయానికి వస్తే.. అహల్య - రాణి అక్కా చెల్లెళ్లు. ఇద్దరూ పెళ్లిళ్లకు సిద్ధంగా ఉంటారు. అనారోగ్యంతో మంచం పట్టిన తండ్రి.. డబ్బు ఆశగల తల్లి.. భార్యమాట వినేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అన్నయ్య..
ఇది కూడా చదవండి: OTT Movie: ఓటీటీలో ఊపిరి బిగబట్టేలా చేసే మలయాళ థ్రిల్లర్! రెండేళ్ల తరువాత తెలుగులో..
ఇది వాళ్ల పరిస్థితి. అహల్య ఒక జ్యుయలరీ షాపులో పనిచేస్తూ ఉంటుంది. ఆ షాపువారు లక్కీ డ్రా క్రింద 10 లక్షల ఖరీదు చేసే కారును ప్రకటిస్తారు. తన యజమాని పంపించగా ఆ షాపులో గోల్డ్ తీసుకున్న అహల్య అన్నయ్య, రాయడం రాని కారణంగా కూపన్ ను ఆమెకి ఇస్తాడు. తన పేరును రాసిన అహల్యకి లక్కీ డ్రాలో ఆ కారు తగులుతుంది. అహల్య ఆ కారును కట్నంగా ఇచ్చి రాణి పెళ్లి చేయాలనుకుంటుంది. అయితే ఆ పెళ్లికొడుకు రాణితో పాటు ఆ కారులో వెళ్లి యాక్సిడెంట్ చేస్తాడు. ఆ వ్యక్తి చనిపోవడంతో శవాన్ని డిక్కీలో పెడతారు. నగలు కొన్నది తాను గనుక కారు తనదే అంటూ అహల్య పైకి అన్నయ్య గొడవకు వస్తాడు. దాంతో డిక్కీలో శవం ఉందని తెలియని పోలీసులు ఆ కారు తీసుకుని స్టేషన్ కి వెళతారు. నగలు కొన్న రసీదు ఎవరు చూపిస్తే వాళ్లకి కారు అప్పగిస్తామని అంటారు. అప్పుడు అహల్య ఏం చేస్తుంది? ఆ తరువాత ఏమౌతుంది? అనేది కథ.
ఇది కూడా చదవండి: Adabidda nidhi Scheme: ఏపీ మహిళలకు శుభవార్త.. నెలకు రూ. 1500పై కీలక అప్‌డేట్! ఈ పథకం త్వరలోనే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Free bus: ఆడవాళ్ళకి అదిరిపోయే శుభవార్త... ఆగస్టు 15 నుంచి అమలు!
Pakistan: భారత్ పై యుద్ధం తప్ప మరో దారి లేదు.. పాకిస్థాన్ సంచలన వ్యాఖ్యలు!
Rythu Bharosa: రైతన్నలూ.. బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోండి! పంట పండించే ప్రతి ఎకరాకు!
Chandrababu warning Jagan: పులివెందుల రాజకీయం చేస్తే.. తోక కట్ చేస్తా! ఎవరు తప్పు చేసినా..
అధికారులు అలర్ట్.. చంద్రబాబు హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్యలు! విశాఖపట్నంలో సీఎం పర్యటన..
ఏసీబీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తతలు! మాజీ మంత్రికి మద్దతుగా వచ్చిన కార్యకర్తలు అరెస్ట్!
ఆ జిల్లా టమాటా రైతులపై ఊజీ ఈగ పిడుగు! దీంతో కొనేవారే..
సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్! FDలపై గరిష్ఠ వడ్డీ ఇస్తున్న బ్యాంకులు!
అసైన్డ్ భూములకు రెక్కలు.. ఈ డీల్‌తో రంగం.. ఆ జిల్లా కేంద్రంగా విశాఖ అధికారుల భేటీలు!
తల్లికి వందనం పడలేదా! పిల్లలు ఇప్పుడే ఫస్ట్ క్లాస్ కి వెళ్తున్నారా...అయితే ఇలా నమోదు చేసుకోండి!
ఆ రెండు దేశాలు చేస్తున్న హడావిడి చూస్తుంటే.. గోల్డ్ రేట్లు ఆకాశంలోకే! బంగారం రూ.3 లక్షలు..కారణం ఇదే!
ట్రంప్ ‘గోల్డ్ కార్డ్’ వెబ్‌సైట్: అమెరికా పౌరసత్వం కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూద్దాం! అర్హతలివే!
సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్! శరణమా, న్యాయ సమరమా తేల్చుకోవాలని జగన్‌కు సూచన!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Aishwarya Rajesh #Soppana Sundari #Aishwarya Rajesh #movie Tamil #movies OTT #releases Black #comedy #movies #Vishal Chandrasekhar Charles #directorial Hotstar #OTT #Tamil cinema
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.